విశాఖపట్నం(విశాల విశాఖ): తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డ గౌతు లచ్చన్న బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కేంద్ర మంత్రి డి.పురందేశ్వరి పేర్కొన్నారు. శనివారం జీవీఎంసీ ఆధ్వర్యంలో జిల్లా జడ్జికోర్టు జంక్షన్‌లో దివంగత డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని మంత్రి డి.పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌతు లచ్చన్న తెలుగుజాతికి గర్వకారణమన్నారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు, మేయర్ పి.జనార్దనరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మచిలీపట్నం ఎంపీ కె.నారాయణ, మాజీ మంత్రి శ్యామ్‌సుందర్ శివాజీ, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, ద్రోణంరాజు శ్రీనివాసు, పంచకర్ల రమేశ్‌బాబు, కమిషనర్ విష్ణు, పోలీసు కమిషనర్ పూర్ణచంద్రరావు, జీవీఎంసీ ఉపమేయర్ దొరబాబు, కార్పొరేటర్ బి.అనురాధ, భాజపా సీనియర్ నేత కె.హరిబాబు, తమిళనాడు యువజన కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జి.శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి