అమెరికా గ్రీన్-కార్డ్ (శాశ్వత పౌరసత్వం) లాటరీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో అభ్యర్థులు ప్రవేశించారు. ఈ సంవత్సరం కోటిన్నర మంది విదేశీయులు అమెరికాలో శాశ్వత పౌరసత్వం కోసం బారులు తీరారు. అమెరికాలో వార్షికంగా 50,000 మంది విదేశీయులకు త్వరితగతిన న్యాయపరమైన, శాశ్వత పౌరసత్వం లభించే విధంగా గ్రీన్-కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.కాగా.. ఈ కార్యక్రమానికి ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చి చేరాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ లాటరీ కార్యక్రమాన్ని "వైవిధ్య వీసా కార్యక్రమం" అనే పేరుతో వ్యవహరిస్తారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 25 శాతం మంది ఈ లాటరీ కోసం దరఖాస్తులు చేసుకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.ఈ లాటరీలో పాల్గొన్న వారి నుంచి కేవలం 50,000 మందిని మాత్రమే ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అమెరికా శాశ్వత పౌరసత్వం అభ్యర్ధుల అదష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియను కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు కొందరు లామేకర్లు మాత్రం ఈ ప్రక్రియకు ఫుల్‌స్టాప్ పెట్టాలని పిలుపునిస్తున్నారు.కెన్యా నుంచి కజకిస్థాన్ వరకూ అభ్యర్ధులు ఇంటర్నెట్ ద్వారా ధరఖాస్తులను పూర్తి చేశారు. ఈ ప్రక్రియ గడువు తేదికి కొన్ని గంటల సమయానికి ముందు, ఒక నెలపాటు ధరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యతో సమానంగా ధరఖాస్తులు అందాయి. గడువుకు చివరి ఘడియల్లో గంటకు 62,000 అప్లికేషన్ల చొప్పున చేరాయి. ఈ ప్రక్రియ ఈ సంవత్సరం నవంబర్ 3న ముగిసింద"ని ఆ పత్రిక వెల్లడించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి