రాష్టప్రతి ప్రతిభాపాటిల్ శుక్రవారం పుట్టపర్తి చేరుకున్నారు. సత్యసాయి 85వ జన్మదిన వేడుకల్లో భాగంగా ‘మహిళ దినోత్సవ’ కార్యక్రమంలో రాష్టప్రతి ప్రసంగించనున్నారు. మూడు దశాబ్ధాలుగా ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హోదాలో మహిళ రాష్ట్రపతి హాజరుకావడం విశేషంష్ట్రపతి రాకను పురస్కరించుకుని భారీ ఎత్తున పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి ప్రశాంతి నిలయం వరకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇక, సత్యసాయి జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం జరిగిన వేణుగోపాలస్వామి రథోత్సవంలో సాయి నామ స్మరణ చేస్తూ వేలాదిమంది పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని సత్యసాయి దగ్గరుండి ప్రారంభించడం ప్రతి ఏటా ఆనవాయితీ. అయితే, గురువారం జరిగిన రథోత్సవ కార్యక్రమానికి బాబా రాక పోవడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు కొంత నిరాశ చెందారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి