విశాఖ(విశాల విశాఖ): మహా విశాఖ నగర పాలక సంస్థలో వంద రోజుల్లోగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కమిషనర్ వి.ఎన్.విష్ణు తెలిపారు. ఈనెల 12వ తేదీలోగా నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తామని మార్చికల్లా ప్రధాన సమస్యలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారులు, కాలువలు, మంచి నీరు వంటి అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. రాజీవ్ అవాస్ యోజన పథకం సర్వే పూర్తవుతుందని వివరించారు. 13వ ఆర్థిక ప్రణాళిక కింద ఇప్పటికే రూ.6.6 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలల అభివృద్ధి, పారిశుద్ధ్యం సమస్యలను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో భాగంగా సంస్కరణలు అమలైతే రూ.434 కోట్లు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం రూ.50 కోట్లు ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. పన్ను చెల్లించమని ప్రభుత్వం జీవో వచ్చిందని, దీనిని తగ్గించే అవకాశం లేదన్నారు. పన్ను విధింపులో లోపాలపై ప్రభుత్వం వివరణ అడిగిందని, దానికి సమాధానం పంపించామని పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి