10 మంది దుర్మరణం
విశాఖ(విశాల విశాఖ): జిల్లాలోని పాయకరావుపేట మండలం నామవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వ్యాన్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు తూర్పుగోదావరి జిల్లా మండపేట వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడినవారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి