విశాఖపట్నం(విశాల విశాఖ): నగరాభివృద్ధిలో విశాఖ పోర్టు కీలక పాత్ర వహించిందని విశాఖహార్బర్ పోర్టు వర్క్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వీవీ రామారావు అన్నారు. ఆదివారం వీజేఎఫ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పోర్టు కార్యకలాపాల్లో 75 ఏళ్లుగా ముఖ్యభూమిక పోషిస్తున్న తమ యూనియన్ వజ్రోత్సవ వేడుకలను ఈనెల 11న పోర్టు కళావాణి స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి గురుదాస్ గుప్తా, పోర్టు ఛైర్మన్ అజేయ కల్లాం పాల్గొంటారని చెప్పారు. పోర్టులో కార్మికుల సమస్యల పరిష్కారంలో తమ యూనియన్ కృషి చేస్తోందన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న యాజమాన్యం పోర్టులో ప్రయివేటీకరణ వైపు మొగ్గుచూపిస్తోందని, అవుట్‌సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడమే దీనికి నిదర్శనమన్నారు. అనంతరం యూనియన్ వజ్రోత్సవాల లోగోను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాయకులు బీసీహెచ్ మసేన్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి