* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

8, డిసెంబర్ 2010, బుధవారం

మన్మోహన్ ఔట్.. రాహుల్ ఇన్..: సోనియా మాస్టర్ ప్లాన్..?

 వరుస కుంభకోణాలతో సతమతం అవుతున్న యూపీఎ సర్కారులో సంచలన మార్పులు జరిగే అవకాశాలు కనబడతున్నాయి. కేంద్రం రాజకీయంగా మరో ఆంధ్రప్రదేశ్‌గా మారనుందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. మన్మోహన్ సింగ్ మరో రోశయ్య గాను.. రాహుల్ గాంధీ మరో కిరణ్ కుమార్ రెడ్డి గానూ.. మారే అవకాశాలు గోచరిస్తున్నాయని వాదిస్తున్నారు.ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని వారు అంటున్నారు. 2జీ స్పెక్ట్రమ్‌పై ఆమె నోరు విప్పకపోవడమే ఇందుకు పెద్ద నిదర్శనం. గత 19 రోజులుగా 2జీ స్కామ్‌పై సంయుక్త పార్లమెంటరీ విచారణ (జెపిసి) జరిపించాలని విపక్షాలు గగ్గోలు పెడుతున్నా కేంద్రం మాత్రం మిన్నకుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఈ కుంభకోణం వెనుక పెద్ద తలకాయలే ఉన్నట్లు తెలుస్తుంది.దీనిపై జేపీసి జరిపిస్తే.. ప్రధానమంత్రి కుర్చీ కింద భూకంపం రాక తప్పదు. సోనియా కూడా ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... స్వయానా జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి అన్నారు. పార్లమెంటులో విపక్షాలు ఒత్తిడి అధికమైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జేపీసి వేయాల్సి ఉంటుంది.ఇదే గనుక జరిగితే.. అవినీతి జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మన్మోహన్ సింగ్ ఇంటిముఖం పట్టక తప్పదని నిపుణులు అంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ రాజకీయ ధోరణి కూడా ఒకింత అధికారం వైపు మొగ్గుచూపుతున్నట్లు కనబడుతుది. తనవద్ద ప్రధానమంత్రి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ఇప్పుడే తొందరేముందని దాటవేస్తున్నారు. అంటే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లే కదా..!!కేంద్రంలో నెలకొన్న ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం 2జీ స్కామ్‌పై జేపీసి వేయక తప్పేలా లేదు. జేపీసిపై పట్టుపట్టండని విపక్షాలను సైతం సోనియా ప్రేరేపిస్తున్నారని స్వామి చెపుతున్నారు. ఇందుకు 2జీ వ్యవహారంపై ఆమె మౌనమే నిదర్శనమని వాదిస్తున్నారు. మరోవైపు రాహుల్ కూడా ఇటీవలి కాలంలో రాజకీయంగా బాగా పరిణితి చెందారు. విపక్షాలపై విమర్శాస్త్రాలు సంధించడం, అభివృద్ధి పథకాలకు వ్యూహరచనలు చేయడం నేర్చుకున్నారు.మొత్తమ్మీద ఈ పరిణామాలను చూస్తుంటే.. మన్మోహన్ ఔట్.. రాహుల్ ఇన్.. అయ్యేందు మరెంతో సమయం పట్టదనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి