15, నవంబర్ 2010, సోమవారం
ఈనెల 21 నుంచి ఆటోల సమ్మె : డ్రైవర్ల జేఏసీ
హైదరాబాద్, నవంబరు 15 : మీటర్ చార్జిల పెంపుతో పాటు అపరిష్కృతంగా ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేని పక్షంలో 21వ తేదీ అర్ధరాత్రి నుంచి నగరంలో ఆటోల సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్‌లో ఏర్పా విలేకరుల సమావేశంలో జేఏసీకన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, జాయింట్ కన్వీనర్ జె. రవీందర్‌కుమార్‌లు మాట్లాడారు.గత నెలలో ఇచ్చిన సమ్మె పిలుపు నేపథ్యంలో చర్చలకు పిలిచిన ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్లే తిరిగి సమ్మె చేయాలని నిర్ణయించామన్నారు. విలేకరుల సమావేశంలో జెఎసీ కార్యనిర్వాహక కార్యదర్శి మహ్మాద్ దస్తగిరి, నాయకులు ఎస్‌కెబి. జమా తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి