గుంటూరు: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు, రైతు నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు ఆచార్య ఎం జి రంగా గొప్ప నాయకుడని, తనకు రాజకీయ గురువని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రంగా కాంస్య విగ్రహాన్ని శుక్రవారం రోశయ్య ఆవిష్కరించారు. ఇప్పటికి రంగా తనకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు. రైతుల అభివృద్ధి కోసం రంగా అలుపెరగని పోరాటం చేశారని ఆయన అన్నారు. మద్రాసు రాష్ట్రంలోని రాజాజీ మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారని రోశయ్య అన్నారు. రంగాతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా రోశయ్య గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కె. లక్ష్మీనారాయణ, పార్లమెంట్ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి