విశాఖపట్నం: విశాఖలో రూ.1475 కోట్లతో మౌలికవసతులు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద ఈ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం స్వర్ణభారతి ప్రాంగణంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. స్వయంసహాయక బృందాల మహిళలకు 20 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అనంతరం శ్రీకృష్ణాపురంలో నిర్మించతలపెట్టిన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ కళాశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో నాబార్డు సాయంతో 33 విద్యార్థి వసతిగృహాలను 330 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. గృహ నిర్మాణ పథకంకోసం 416 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మైక్రోఫైనాన్స్ బాధితులకు సాయంగా ఉంటామని వారికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేశామని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి