లండన్: రోజూ కనీసం ఒక అరగంట నడిచినా 24 రకాల జబ్బుల నుంచి రక్షణ లభిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. మధుమేహం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్, గుండెజబ్బులు, రక్తపోటు తదితర రుగ్మతలు దరికి చేరవని.. వృద్ధాప్యం కూడా అంత తొందరగా రాదని వెల్లడైంది. ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గత నాలుగేళ్లలో జరిగిన 40 పరిశోధనలను పరిశీలించి ఈ వివరాలను తెలియజేశారు. వారానికి ఐదురోజులపాటు రోజూ అరగంట నడిచినా లేదా వారానికి 150 నిమిషాలపాటు వ్యాయామం చేసినా ఈ ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. జాగింగ్ వంటి కొంత కఠినమైన వ్యాయామం చేయగలిగే వాళ్లు వారానికి మూడురోజులపాటు రోజూ 20 నిమిషాలు చేసినా సరిపోతుందన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి