ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది స్టీల్ వర్కర్లు తమ ఉపాధిని కోల్పోనున్నారు. రాష్ట్రంలో ఉన్న మధ్యతరహా స్టీల్ ప్లాంట్లలో 175 ప్లాంట్ల యజమానులు తమ ప్లాంట్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్లాంట్లలో పని చేస్తున్న 50 వేల మంది రోడ్డున పడనున్నారు. నానాటికీ పెరిగిపోతున్న స్టీల్ (ఉక్కు) ధరలతో పాటు.. ముడి ఇనుముగా స్పాంజ్ ఐరన్‌ను వినియోగిస్తున్నారు. దీంతో మధ్యతరహా ప్లాంట్‌లు మనుగడ కొనసాగించలేక పోతున్నాయి. ఫలింతా 175 స్టీల్ ప్లాంట్లను మూసివేయాలని యజమానులు నిర్ణయించారు.దీనిపై ఛత్తీస్‌గఢ్ మిలీ స్టీల్ ప్లాంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ సురానా మాట్లాడుతూ.. స్పాంజ్ ఐరన్ ధర రూ.14,000 - 15,000 నుంచి రూ.18,000 పెరిగినప్పటికీ అవసరాలకు అందడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి తమ ప్లాంట్లను మూసి వేయడం మినహా తమకు ప్రత్యామ్నాయం లేదని ఆయన వివరించారు. తాము తీసుకున్న 175 స్మాల్ యూనిట్లలో పని చేస్తున్న 50 వేల మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి