* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

16, నవంబర్ 2010, మంగళవారం

 । పోలవరం పనులు ప్రారంభించండి
కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పనులను తక్షణమే ప్రారంభించాలని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై వస్తున్న అపోహలు అర్థరహితమన్నారు. హోదా సంగతి పక్కన పెట్టినిలిపివేసిన ప్రాజెక్టు పనులను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. స్పిల్‌వే నిర్మాణానికి పోలవరమే అనువైన ప్రాంతమన్నారు.ఏటా 3వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని ఉండవల్లి అన్నారు. సీజన్లో నీరు రావాలంటే రైతులకు పోలవరమే దిక్కు అన్నారు. ఈ ప్రాజెక్టుపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని నిర్మాణం ఆగితే రాష్ట్రంలో ఆహార సమస్య ఏర్పడుతుందన్నారు. పోలవరం ధాన్యాగారానికే కాకుండా, దేశానికే వరప్రసాదం అన్నారు. పోలవరం లేకుంటే కృష్ణా డెల్టా బీడుగా మారుతుందన్నారు. నష్టం వస్తుందని భయపడి ప్రాజెక్టు పనులు నిలిపివేయటం సరికాదన్నారు. ఎస్‌ఆర్ రేట్లు గిట్టుబాటు కాకపోవటంతోనే టెండర్లు నిలిచిపోయాయన్నారు.ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిషాకు గానీ, ఛత్తీస్‌గఢ్‌కు కానీ అభ్యంతరాలు ఉండే ప్రశ్నేలేదన్నారు. వ్యవసాయ రంగం బాగుపడితే దేశం ప్రగతిబాటలో పయనిస్తుందని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన అన్నారు. పోలవరంపై పెట్టే పెట్టుబడి అయిదేళ్లలో తిరిగి వస్తుందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇచ్చామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని ఉండవల్లి అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి