* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

19, నవంబర్ 2010, శుక్రవారం

శబ్ధాల్లోనూ వినగలగడం వరమే



    ఒకవైపు జోరుగా పార్టీ జరుగుతోంది... ఎటు చూసిన జనం పెద్ద ఎత్తున మాటలు వినిపిస్తున్నాయి. అయినా సరే... మీతో మాట్లాడే వ్యక్తి మాటలు వినగలుగుతున్నారంటే చాలా అదృష్టం. అంతటి ధ్వనిలోనూ వినగలిగారంటే అది నిజంగా వరమే...ఈ విధంగా వినగలగడమనేది సామాన్యమైన పని కాదు. ఇలా వినగలగడాన్ని శాస్త్రవేత్తలు 'కాక్టైల్ పార్టీ ఫినామినా' అని అంటారు. పార్టీ జరుగుతున్న సమయంలో వివిధ రకాల శబ్దాలు వినిపిస్తుంటారు. పాటలు... సంగీతం.. ఈలలు, కేకల మధ్య ఎదుటి వారి మాటలను నినగలగడం విశేషమేనంటున్నారు.ధ్వని దిశను అనుసరించి వినిపిస్తుందనేది చాలా కాలంగా ఉంది. కాని ఇటీవల అమెరికా పరిశోధకులు దీనిపై పలువురి వినికిడి శక్తిని గమనించారు. ఇది పూర్తిగా శ్రవణంలోని నాడీ విధానంపై ఆధారపడి ఉంటుందని తేల్చేశారు. ఆ నిర్మాణం తీరు తెన్నులపై ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిర్ణయించారు. వినే వ్యక్తి వీటన్నింటిని స్వీకరిస్తాడు.వీటన్నింటిలో వినగలిగే వ్యక్తి వీటిలో ఒకదానిని గుర్తుపెట్టకోగలుగుతాడు. ఒక్కొక్కరి మాటలు ఒక్కొక్క విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వారి మాటలను అనుసరించే శ్రవణ పౌనఃపుణ్యత ఉంటుంది. అందరి మాటలు ఒకే మారు వినిపిస్తుంటాయి. వీటిలో ఒకటి మాత్రమే మిగిలిన వాటిని అధిగమించి నియంత్రణా విభాగాలను చేరుతుంది.మిగిలిన వారి మాటలు చాలా దూరంగా ఉండడం వలన ఇది సాధ్యమవుతోంది. ఇది ఎలా సాధ్యమవుతుందనే అంశాలను పరిశోధకులు చాలా ధీర్ఘంగా వివరించారు. వీరి వాదనలు విన్న తరువాత అవి నిజమేననక తప్పదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి