ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ సుడిగాలి పర్యటనలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధిష్టానానికి పంటికింద రాయిలా మారిన వైఎస్ జగన్ వర్గానికి వీరవిధేయులుగా ఉన్న ముగ్గురు మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. జగన్ ఓదార్పులో పాల్గొనవద్దని ఎంత చెప్పినప్పటికీ వినని ఈ మొండి మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని రోశయ్య అడిగినట్లు సమాచారం.సీఎం రోశయ్య అడిగినదానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్ వీరివిధేయులుగా ముద్రపడిన మంత్రుకు ఉద్వాసన పలికి వారి స్థానంలో జానారెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డిలతోపాటు ప్రజారాజ్యం పార్టీని కూడా మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే చిరంజీవి ఢిల్లీకి పయనమై వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ చేపడితే ప్రస్తుతం ఉన్న మంత్రుల సంఖ్య 33 నుంచి 45కి పెరిగే అవకాశం ఉంది. మొత్తమ్మీద సీఎం రోశయ్య ఢిల్లీ పర్యటన రకరకాల అనుమానాలకు తావిచ్చింది. అసలు సంగతి ఏమిటన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి