న్యూఢిల్లీ : సెల్ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మొబైల్ నెంబర్ పోర్టబిలిటీని కేంద్ర టెలికాం మంత్రి కపిల్‌సిబాల్ ప్రారంభించారు. మొదట హర్యానాలో ఈ సర్వీసును ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ పథకంలో సెల్ వినియోగదారుడు అదే నెంబరుతో వేరే సర్వీసుకు మారే సౌలభ్యముంటుంది. వచ్చే సంవత్సరం జనవరి 20 నుంచి ఈ పథకం దేశమంతా అమల్లోకి వస్తుందని టెలికాం వర్గాలు ప్రకటించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి