18, నవంబర్ 2010, గురువారం
.రాజధానిలో మరో డ్రగ్స్ ముఠా: పట్టుబడ్డ ఇద్దరు నైజీరియన్లు
హైదరాబాద్: హైదరాబాదులో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్సు సరఫరా ఇద్దరు నైజీరియన్లను బంజారాహిల్సు పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ కొంటున్న వారినుండి పోలీసులు మొబైల్ ఫోన్లు, పాసుపోర్టు తీసుకున్నారు. వారిని పోలీసు స్టేషన్ కి తరలించారు. 73 గ్రాముల కొకైన్ దొరికింది. డ్రగ్సు కొంటూ దొరికిన వారు ప్రముఖుల కుమారులని సమాచారం. అయితే ఇప్పుడే వారు ఎవరో చెప్పేందుకు ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు.గత కొంతకాలంగా విదేశీ డ్రగ్సు మాఫియా మనపై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. సంపన్న కుటుంబాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకొని విదేశీయులు డ్రగ్సు సరఫరా చేస్తున్నారు. గతంలో పలుమార్లు విదేశీయులు డ్రగ్సు అమ్ముతూ పట్టుబడ్డారు. ఇటీవల ప్రముఖ చిత్ర కథానాయకుడు రవితేజ సోదరులు ఉగండాకు చెందిన వ్యక్తుల దగ్గరనుండి డ్రగ్సు తీసుకుంటూ పట్టుబడ్డారు. డ్రగ్సు వ్యవహారంలో ప్రముఖుల హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాదు, బెంగుళూరులలో డ్రగ్సు మాఫియా ఉంది. ముంబయి మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో హైదరాబాదు పోలీసులు ముంబయి పోలీసులను అలర్ట్ చేశారు. ఇక్కడ కూడా డ్రగ్సు సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి