ఉదయం 5 నుంచి 12 గంటల వరకు అమలు
హైదరాబాద్: ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 10కె రన్ నిర్వహించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 10కె రన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పరుగులో పెద్దఎత్తున పాల్గొనేవారికి అసౌకర్యం కల్గకుండా నగర పోలీస్ కమిషనర్ ఎ.కె.ఖాన్ ట్రాఫిక్ మళ్లింపు ఆదేశాలు జారీ చేశారు.రాజ్‌భవన్, పంజాగుట్ట, ఆనంద్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్త్లెఓవర్‌పైకి అనుమతించరు.ఐమాక్స్ థియేటర్ నుంచి వచ్చే వాహనాలు ఇందిరాగాంధి విగ్రహం జంక్షన్ పక్క నుంచి ఖైరతాబాద్ ఫ్త్లెఓవర్ మీదుగా వెళ్లొచ్చు.తెలుగుతల్లి విగ్రహం నుంచి వచ్చేవారు సచివాలయం హెలీప్యాడ్ పక్క నుంచి ఐమ్యాక్స్ థియేటర్.. ఖైరతాబాద్ ఫ్త్లెఓవర్ మీదుగా వెళ్లిపోవచ్చు.బైబిల్ హౌస్, ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించరు. కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.హిల్‌పోర్ట్ నుంచి తెలుగుతల్లి ఫ్త్లెఓవర్ కిందుగా కుడివైపు అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. వీరు ఎడమవైపుగా ఇక్బార్‌మినార్ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.బషీర్‌బాగ్ నుంచి వాహనాలు అంబేద్కర్ విగ్రహం పక్క నుంచి ట్యాంక్‌బండ్ వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలు జీహెచ్‌ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లొచ్చు. లేదంటే లిబర్టీ చౌరస్తా నుంచే హిమాయత్‌నగర్ మీదుగా ప్రయాణించవచ్చు.రసూల్‌పుర నుంచే రాణిగంజ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కిమ్స్ మీదుగా ప్యారడైజ్‌వైపు మళ్లిస్తారు.ఎం.జి.రోడ్డు మీదుగా కర్బాల మైదాన్ వైపు వచ్చే వాహనాలను రోచా బజార్ టీ జంక్షన్ మీదుగా బాటా చౌరస్తా వైపు మళ్లిస్తారుబాటా చౌరస్తా నుంచి కర్బాలా మైదాన్ వైపు వచ్చే వాహనాలు బైబీల్ హౌస్ మీదుగా కవాడీగూడ చౌరస్తా మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.కవాడిగూడ నుంచే వాహనాలు చిల్డ్రన్స్ పార్క్ మీదుగా ట్యాంక్‌బండ్ మీదకి అనుమతించరు. డీబీఆర్ మిల్స్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ చేరుకోవచ్చు.వీఐపీలకు మాత్రమే: పరుగులో పాల్గొనేవారు పై మార్గాలను మార్గాలను అనుసరించి పార్కింగ్ స్థలం వద్దకు చేరుకోవచ్చు.వీఐపీ పాసులున్న వాహనదారులను ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తా మీదుగా పీపుల్స్ ప్లాజాకు చేరుకునేందుకు అనుమతిస్తారు. వీరు అక్కడ పార్క్ చేసుకోవచ్చు.సాధారణ పాసులున్న వాహనదారులను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పార్కింగ్, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్, లుంబినీ పార్క్ పార్కింగ్ వరకు అనుమతిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి