హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన "గుజారిష్" చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో హృతిక్‌తో శృతిమించిన శృంగార సన్నివేశాలలో ఐష్ నటించిందని గత వారం నుంచీ బాలీవుడ్ సీనీజనం ఒకటే వాయిస్తున్నాయి. దీంతో ఐశ్వర్య తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఒక దశలో దర్శకుడితో అటువంటి సన్నివేశాలేమైనా ఉంటే దయచేసి తొలగించండి అని చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా శుక్రవారం సినిమా విడుదల కావడంతో ఆ చిత్రాన్ని తనతోపాటు చూడాల్సిందిగా ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌ను కోరినట్లు సమాచారం. భార్యకోసం ఏదైనా త్యాగం చేసేందుకు సిద్ధపడతాడన్న పేరున్న అభిషేక్, ఐష్ అడిగిందే తడవుగా తన "ప్లేయర్స్" చిత్రం షూటింగ్ వాయిదా వేసుకుని గోవా నుంచి ఫ్లైట్ ఎక్కి ముంబయిలో వాలిపోయాడట. భర్తరాగానే మిగిలిన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని వెళ్లి సినిమా చూపించిందట ఐష్. అంతా చూశాక అభి స్పందిస్తూ... నిజంగా "గుజారిష్"లో నటించిన నటీనటులందరినీ ప్రత్యేకంగా అభినందించాల్సిందే. "ఏం నటనా.. ఏం మూవ్‌మెంట్స్.. ఓహ్ సూపర్బ్. ముఖ్యంగా నా భార్య, నా స్నేహితుడు హృతిక్ అయితే జీవించారనుకోండి" అంటూ పొగడ్తల వర్షం కురిపించాడట. సినిమాలో తమ నటనను భర్త అలా మెచ్చుకునేసరికి ఐష్ కళ్లవెంట ఆనంద భాష్పాలు రాలాయట. భర్త అంతగా పొగిడితే ఏ భార్య మాత్రం ఆనందించకుండా ఉండగలదు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి