ముఖ్యమంత్రి రోశయ్య బుధవారంనాడు విశాఖపట్టణంలో పర్యటన చేపట్టారు. తన పర్యటనలో భాగంగా ఆయన స్వయంసహాయక బృందాలతో సమావేశమయ్యారు. సభ జరుగుతుండగా కొంతమంది మహిళలు పెంచిన ఆస్తి పన్నును తక్షణం తగ్గించాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. దీంతో ముఖ్యమంత్రి అసహనానికి గురయ్యారు.స్వయంసహాయక బృందాలు ప్రభుత్వం అందించిన సాయానికి మనసారా అభినందించడానికి ఇక్కడ సమావేశమైతే మీరేంటి...? సభను రసాభాస చేస్తున్నారు. అంటూ రోశయ్య ఆందోళన చేస్తున్న మహిళలపై మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే వెళ్లి బజార్లో చేసుకోవాలని సూచించారు.సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని, అంతేతప్ప ప్రభుత్వం నిర్వహిస్తున్న సభల్లోకి ప్లకార్డులు పట్టుకుని సభలోకి దూసుకు రావద్దని ముఖ్యమంత్రి రోశయ్య సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకోసమే పుట్టిందని, గత 125 ఏళ్లుగా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నదని అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి