ఒక్కోసారి ఓ చిన్న అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాంటిదే ఈ సంఘటన. ప్రాజెక్టులో భాగంగా మా కంపెనీ అవుట్‌డోర్ టూర్ ప్లాన్ చేసింది. ఓ రోజు రాత్రి అందరం సరదగా ఆడుతూ పాడుతూ గడుపుతున్నాం. అక్కడ ఓ చిన్నసైజు పార్టీ వాతావరణం నెలకొంది.అక్కడి వాతావరణం బాగా చలిగా ఉండటంతో కట్టెలతో మంట వేసి దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ... ఆ మంటకి దగ్గరగా కూర్చొని ఉన్న మా సహోద్యోగిని కాసేపటికి లేచి బాధతో అరుస్తూ, ఏడుస్తూ బాధ తాళలేక ఇష్టం వచ్చినట్లు గెంతుతూ నానా హైరానా పడసాగింది.ఆ అమ్మాయికి ఏంజరింగిందో, ఎందుకలా ప్రవర్తిస్తుందో ఎవరికీ అంతుబట్టలేదు. ఆ తర్వాత తనని హాస్పిటల్‌లో చేర్చాం. తనని పరీక్షించిన డాక్టర్లు ఆమెకి శాశ్వతంగా చూపు పోయిందని తేల్చారు. దానికి కారణమేంటో తెల్సా..! తను వాడిన కాంటాక్ట్ లెన్స్. ఆ కాంటాక్ట్ లెన్స్ ప్లాస్టిక్‌తో చేసినవి కావడం వల్ల ఆ చలి మంట తాలూకు వేడికి ఆ లెన్స్ కరిగి తన చూపుని దెబ్బతీశాయి.ఈ సంఘటన మా అందరినీ కలచి వేసింది. ఫ్యాషన్ ప్రపంచానికి అలవాటు పడుతున్న యువత ఇలా అందానికి పోయి అనర్థాలు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి కాంటాక్ట్ లెన్స్ వాడే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. కాంటాక్ట్ లెన్స్ వాడాలనుకునేవారు ఈ కింది విషయాలపై దృష్టి సారించాలి. వీటి వాడకంలో సమస్యలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.కాంటాక్ట్ లెన్స్‌ను వైద్యుల సలహా మేరకే కొనుగోలు చేయాలి. మార్కెట్‌లో ఇష్టం వచ్చిన వాటిని కొని వినియోగిస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి. అలాగే.. నాణ్యమైన వాటినే కొనుగోలు చేయాలి, నాసిరకం వాటిని కొనుగోలు చేసి ఇబ్బందులు తెచ్చుకోకండి.లెన్స్ కొనుగోలు చేసేటపుడు వాటి గడువు తేది (ఎక్స్పైరీ డేట్)ని పరీక్షించుకోవాలి. గడువు ముగిసిన వాటిని వినియోగిచడం ప్రమాదకరం.రంగు, రంగుల లెన్స్ ఎంచుకునేటప్పుడు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రంగుల వల్ల కళ్లకు హాని కలిగే ప్రమాదం ఉంది.వీటిని ధరించినపుడు కళ్లు నలపడం, ఏడవడం వంటి పనులు చేయకూడదు. ఇవి ధరించినపుడు పొగ, ధూళికి దూరంగా ఉండాలి. నిద్రించే సమయంలో లెన్స్ వాడకండి.
లెన్స్ భద్రపరిచేందుకు కూడా ఓక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుది దానిని తెలుసుని ఆ విధంగా భద్రపరిస్తే మంచిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి