27, నవంబర్ 2010, శనివారం
మంత్రి పదవి నాకివ్వరు.. ఇచ్చినా నేను తీసుకోను: పిల్లి
కొత్త మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించరని, ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా తాను స్వీకరించబోనని రాష్ట్ర తాజా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఆయన శనివారం యానాంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తనకు స్థానం దక్కుతుందనే ఆశలు లేవన్నారు. ఒకవేళ మంత్రిపదవి ఇచ్చినా తాను తీసుకోబోనన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ శక్తిమేరకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీలో తిష్టవేసి ఎంపీలతో లాబీయింగ్ చేయిస్తున్నారు.అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం తద్విరుద్ధంగా యానాంలో పర్యటిస్తూ కాలం వేళ్లదీస్తున్నారు. తనకు మంత్రిపదవి దక్కినా దక్కక పోయినా ఒక్కటేనని ప్రకటించారు. పదవి ఇచ్చినా ఇవ్వక పోయినా కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి