24, నవంబర్ 2010, బుధవారం
పావులు కదుపుతున్న చిరంజీవి, ముఖ్యులతో సమావేశం
హైదరాబాద్: కాంగ్రెసులోని ప్రస్తుత పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే కాంగ్రెసుకు మద్దతిస్తామని చిరంజీవి ఢిల్లీలో చెప్పారు. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తే కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగిపోయాయని అంటున్నారు. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు వైయస్ జగన్ కే ఉందని, వైయస్ జగన్ పేరును సిఎల్సీ సమావేశంలో ప్రతిపాదిస్తామని శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి చెప్పారు. దీన్ని బట్టి పకడ్బందీ వ్యూహంతో సిఎల్పీ సమావేశానికి హాజరవుతన్నట్లు తెలుస్తోంది.వైయస్ జగన్ వర్గం కాంగ్రెసు శాసనసభ్యులను చీలిస్తే చిరంజీవి వెంటనే తన మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. అందుకు ప్రతిగా తాను డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవిని, మరో ఇద్దరు శాసనసభ్యులకు మంత్రి పదవులు తీసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానంతో డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రజారాజ్యం పార్టీ ముఖ్యులు సమావేశమవుతున్నారు. ఢిల్లీ నుంచి చిరంజీవి కూడా హైదరాబాదుకు బయలుదేరినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు కోరితే తాను మద్దతిస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి