టాటా మోటార్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిన్న కారు నానో.. ఇప్పుడు రాష్ట్రీయ మార్కెట్‌లో కూడా ఓపెన్ సేల్స్‌కు వచ్చేసింది. ఈనెల 22 నుంచి నానో ఎలాంటి ముందస్తు బుకింగ్ అవసరం లేకుండా షో రూంకు వెళ్లి కొనుగోలు చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర మార్కెట్‌లో కల్పించింది.దీంతో గతేడాది నానో కార్లను బుక్ చేసుకోలేని వారు ఇప్పుడు నేరుగా షోరూమ్‌లుక వచ్చి నానో కారుని కొనుగోలు చేసుకునే అవకాశం ఏర్పడింది. షోరూంలలో టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని కూడా టాటా మోటార్స్ కల్పిస్తోంది. నానో కారు కొనుగోలుకు కావాల్సిన రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని, ఇందుకు గానూ 26 బ్యాంకులతో తమ కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకుందని టాటామోటార్స్ తెలిపింది.కాగా.. ఈ తరహా ఓపెన్ సేల్స్ ఇప్పటికే.. గుజరాత్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో టాటా మోటార్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి