15, నవంబర్ 2010, సోమవారం
ఎయిర్‌లైన్స్ ప్రారంభోత్సవానికి లంచం అడిగారు: రతన్‌టాటా
న్యూఢిల్లీ: టాటా సంస్థల ఛైర్మన్ రతన్‌టాటా ఈరోజు సంచలన ఆరోపణలు చేశారు. 15 ఏళ్ల క్రితం టాటా ఎయిర్‌లైన్స్ ప్రారంభోత్సవానికి తమను 15 కోట్ల రూపాయల లంచం అడిగారని తెలిసిందని అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన పారిశ్రామికవేత్తలకు నిజాయితీ, నమ్మకం ఉంటే ఎవరికీ భయపడనవసరం లేదని అంటూ ఈ విషయం పేర్కొన్నారు. తమను లంచం అడిగినా తాము కరెక్ట్‌గా ఉన్నప్పుడు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని తిరస్కరించామని ఆయన చెప్పారు. అయితే లంచం అడిగింది ఎవరో ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నారా లేక గత ప్రభుత్వంలో ఉన్నారా అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి