రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భారీవర్షం తాకిడికి వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో సుమారు 90 వేల హెక్టార్లకు పైగా వరి పంట నీటి పాలైనట్లు ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఇక కృష్ణా జిల్లాలో అరటి పంట నేలమట్టమైంది. చేతికి వచ్చిన వరిపంట నీటి పాలైంది. సుమారు 45 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న వరి పంట చేతికి రాకుండా పోవడంతో అన్నదాతలు భోరుమంటున్నారు.ఉభయగోదావరి జిల్లాల్లో సైతం పంట తీవ్రత ఎక్కువగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 40 వేల ఎకరాలకు పైగా వరి పంటకు నష్ట వాటిల్లినట్లు అంచనా. తూర్పుగోదావరిలో 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంటతోపాటు రెండు వేల 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాకు భారీగా నష్టం వాటిల్లింది. ఇక్కడ సుమారు 50 వేల హెక్టార్ల మేర వరి పంట మట్టిలో కలిసి పోయింది. వర్షం మిగిల్చిన తీవ్ర నష్టాన్ని రేపు ఉదయం ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి