ఇంతకీ ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావించారంటే... ఆదివారంనాడు రవితేజ "మిరపకాయ్" ఆడియో ఫంక్షన్లో పైరసీ గురించి నాగబాబు మాట్లాడుతూ... విడుదలైన రోజునే పైరసీ సీడీలు వస్తున్నాయి. కోట్లు పెట్టి తీసిన నిర్మాతల నోళ్లలో మన్నుకొడుతున్నారంటూ ధ్వజమెత్తారు.సభలో ఉన్న మంత్రి టీజీ వెంకటేష్‌ను... పైరసీపై ప్రభుత్వం టాడా యాక్ట్ తేవాలని కోరారు. దీనిపై వర్మ స్పందిస్తూ... " నేను ఇండస్ట్రీకి రాక మునుపు వీడియో లైబ్రరీ నడిపేవాడిని. అప్పుడు 'ఆఖరి రాస్తా' పైరసీ చేసి పట్టుబడ్డాను. పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు ఎస్ఐ ఓ మాట అన్నాడు. మీరు 100 రూపాయలకు కక్కుర్తి పడితే లక్షలు సంపాదించే వారికి ఏంటి..? ఇబ్బంది అని అన్నారు.అంటే... ఆయన ఆలోచనలో ఆయన కరెక్టే. నిర్మాతల బాధలు వారికి తెలీవు. కారుల్లో హ్యాపీగా తిరుగుతున్నారనుకుంటారు. అందుకే ఈ పైరసీ గురించి ముందుగా పోలీసులను ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే పైరసీ కంట్రోల్ అవుతుందని సూచించారు వర్మ.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి