స్ట్రాబెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడు, నరాల రుగ్మతలు వచ్చే అవకాశాలను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. రక్తంలోని హానికర విష పదార్థాలను తొలగిస్తాయి స్ట్రాబెర్రీలు.ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల కాలేయ రోగాలు, కంటిచూపు మందగింపు, వాతరోగం, కీళ్లవాతం, మలబద్దకం, అధిక రక్తపోటు, మెదడు పనితీరు క్షీణించడం, చర్మ క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలను దూరంగా ఉంచవచ్చు. స్పష్టమయిన ఆరోగ్య ప్రయోజనాల సంగతి అలా ఉంచితే, రోజూ 8 నుంచి 10 స్ట్రాబెర్రీలను తినడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.భవిష్యత్‌లో గుండెపోటు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుందని ఇటీవల అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అతిసార, వాతరోగం, జీర్ణక్రియ సమస్యలు స్ట్రాబెర్రీ ఆకులు, వేరులు తినడం వలన నయమవుతాయి.స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున అల్జీమర్స్ (జ్ఞాపక శక్తి తగ్గడం) మెదడు పనితీరు క్షీణించడం వంటి వ్యాధులు వస్తే తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి