న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్రప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఈ గురువారం హైదరాబాద్ రానున్నారు. ఐదుగురు సభ్యుల కమిటీ ఈ నెల 16న హైదరాబాద్ చేరుకుని, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమవుతుంది. కమిటీని నియమించిన తరువాత 4 నెలల పాటు రాష్టమ్రంతా పర్యటించి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై ప్రజాభిప్రాయాలు సేకరించిన కమిటీ, ఈ నెల 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. 31న కమిటీ నివేదిక అందిస్తుంది.. సందేహంలేదు. ఆ డెడ్‌లైన్‌కు కట్టుబడి ఉన్నాం. నివేదిక రూపకల్పన ప్రక్రియ శీఘ్రగతిన కొనసాగుతోంది* అని కమిటీ సీనియర్ సభ్యుడొకరు చెప్పారు.16న పార్టీల నాయకులతో జరిపబోయే భేటీ కేవలం అనధికారిక సమావేశమేనన్నారు. అది ఇష్టాగోష్టి భేటీ వంటిది.. ఇంకా చెప్పాలంటే అందరికి కృతజ్ఙతలు తెలిపే సమావేశం.. గత 10 నెలలుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు అందించిన సహకారానికి మేం వ్యక్తిగతంగా వారికి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాం* అన్నారు. సీఎం కిరణ్‌కుమార్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి