హైదరాబాద్(విశాల విశాఖ): భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం వేర్వేరుగా పర్యటించబోతున్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉదయాన్నే రోడ్డు మార్గాన ఖమ్మం జిల్లాకు బయలుదేరుతున్న చంద్రబాబు 9.30 గంటలకు నేలకొండపల్లికి చేరుకుంటారు. 11.30కి ముదిగొండ, ఒంటిగంటకి కొణిజర్ల, మూడు గంటలకు తల్లాడల్లో పర్యటించిన అనంతరం కృష్ణాజిల్లాకు వెళతారు. తిరువూరు నియోజక వర్గంలోని కాకర్లలో 4.30 గంటలకు, కంభంపాడులో 5 గంటలకు, నూజివీడు నియోజకవర్గం పరిధిలోని మీర్జాపురంలో 6 గంటలకు పర్యటిస్తారని తెదేపా మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వస్తారు.ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొంటారు. పుష్కర స్నానం ఆచరించిన అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా కూసుమంచికి వెళ్లి పంట పొలాల్ని పరిశీలిస్తారని ప్రరాపా నేతలు జ్యోతుల నెహ్రూ, బసవరాజు శ్రీనివాస్, పద్మలు ఒక ప్రకటనలో తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి