గుడివాడ (విశాల విశాఖ): యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎనలేని ప్రజాదరణ ఉందని మాజీమంత్రి కొండా సురేఖ అన్నారు. డీసీసీ మాజీ అధికార ప్రతినిధి మండలి హనుమంతరావు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాము ఊహించినదానికన్నా రెట్టింపు స్థాయిలో జగన్‌పట్ల ప్రజల్లో అభిమానం ఉందని, అది ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని అన్నారు. జగన్ స్థాపించబోయే పార్టీకి ప్రజానీకం బ్రహ్మరథం పట్టడం తథ్యమన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎంతటి పదవిలో ఉన్నా అభిమానులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంటే, జగన్ వైపునకు రాక తప్పదని సురేఖ వ్యాఖ్యానించారు. కేవీపీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి