12, డిసెంబర్ 2010, ఆదివారం
ఏవీఎన్ కాలేజీ 150వ వార్షికోత్సవాలు
విశాఖపట్నం: మిసెస్ ఏవీఎన్ కాలేజీ 150వ వార్షికోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కళాశాల వ్యవస్థాపకుడు వెంకటనర్సింగరావు కుటుంబసభ్యులు, పలువురు నగర ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా వేడుకలు జరిగాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డి.పురందేశ్వరి ఉత్సవాలను ప్రారంభించారు. ముందుగా కళాశాల వ్యవస్థాపకులు అంకితం వెంకట నర్సింగరావుకు ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ జె.శ్యామలరావు మాట్లాడుతూ సర్ సి.వి.రామన్, అల్లూరి సీతారామరాజు, శ్రీశ్రీ వంటి మహనీయులు చదివిన ఈ కాలేజీ చాలా గొప్పదని కొనియాడారు. ఏవీఎన్ పూర్వ విద్యార్థి, ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ మహానేత వై.ఎస్. అప్పట్లో వెంటనే ఈ కళాశాల అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి