ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికకు ప్రజారాజ్యం పార్టీ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజారాజ్యం కార్యకర్తలు, అభిమానులు తన వెంటే ఉన్నారని చిరంజీవి చెప్పారు. తెలంగాణలో ప్రజారాజ్యానికి ఎలాంటి ఢోకాలేదన్నారు.ఆదివారం ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొనడానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో అర్జుల గుట్టకు చేరుకున్నారు. అక్కడ ప్రాణహిత పుష్కరాల్లో స్నానమాచరించారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇంకా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, జై తెలంగాణ అన్నాలని పట్టుబట్టారు. అందుకు స్పందించిన చిరంజీవి పీఆర్పీ ముందు చెప్పినట్లే శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉంటుందని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి