హైదరాబాద్: కొంతకాలంగా వూపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ సినీనిర్మాత కె.దేవీవరప్రసాద్(68) శుక్రవారం మృతిచెందారు. దేవీఫిలింస్ బ్యానర్‌పై ఆయన పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. భలేతమ్ముడు, మంచిదొంగ, కొండవీటిరాజా, అల్లుడామజాకా, కేడీ నెంబర్‌వన్, ఘరానామొగుడు, మృగరాజు, భజంత్రీలు, అమ్మ రాజీనామా వంటి చిత్రాలు నిర్మించారు. 1943 డిసెంబరు 6న జన్మించారు, ఆయన స్వస్థలం విజయవాడ. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. దక్షిణభారత చలనచిత్ర మండలి కార్యదర్శిగా పనిచేశారు. ఆదివారం విజయవాడలో వరప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి