* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

10, డిసెంబర్ 2010, శుక్రవారం

భారీవర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రాంతాలలో రైతులు సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి వట్టి

పంటనష్టం వివరాల సేకరణలో అనర్హుల పేర్లు జాబితాలో ఉంటే సంబంధిత వ్యవసాయాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర పర్యాటక,క్రీడలు, యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీ వట్టి వసంతకుమార్‌ హెచ్చరించారు. ఉంగుటూరు మండలం రాచూరులో గురువారం నష్టానికి గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టాలను యుద్ద ప్రాతిపదికపై అంచనా వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యాటక శాఖామంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రి శ్రీ వట్టి వసంతకుమార్‌ ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల్లో సుడిగాలి పర్యటన చేసి రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అనేకసార్లు పంట నష్టానికి గురై కుదేలైన రైతాంగాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోవలసి ఉందన్నారు. రైతుల పక్షాన నిలవవలసిన అవసరం ఉందన్నారు. పంటనష్టం సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని, పంట నష్టపోయిన ఏ ఒక్క రైతునూ విస్మరించవద్దన్నారు. కౌలు రైతుల వివరాలను కూడా సేకరించాలన్నారు. పంటనష్ట పరిహారం విషయంలో ఆయా రైతుల పేర్లను గ్రామసభలలో దృవీకరించుకోవాలని అధికారులను ఆదేశించారు. భారీవర్షాల వల్ల జిల్లాలో రైతాంగం నష్టపోయారని మంత్రి శ్రీ వట్టి వసంతకుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రంగుమారిన ధాన్యాన్ని ఎ ఫ్‌సిఐ ద్వారా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. తొలుత ఉంగుటూరు మండలం రాచూరు, నిడమర్రు మండలం అడవికొలను, గణపవరం మండలం పిప్పర, ముప్పర్తిపాడు, భీమడోలు మండలం లింగంపాడు గ్రామాలలో భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట జాయింట్‌ కలెక్టరు శ్రీ పి.వెంకట రామిరెడ్డి, అదనపు జాయింట్‌ కలెక్టరు శ్రీయం.వి శేషగిరిబాబు, ఆర్‌.డి.ఒ శ్రీ వి.ఆర్‌ .కె ప్రభాకర్‌ రావు, వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టరు శ్రీ యం.బాలసుబ్రహ్మణ్యం, జెడ్‌.పి.టి.సిలు శ్రీకిరణ్‌ కుమార్‌ , శ్రీ పోసినశెట్టి రామ్మూర్తి, యంపిపిలు శ్రీమతి బోడాదేవరమ్మ, శ్రీమతి కె.సుబ్బలక్ష్మి ఆయా మండలాల తాహసిల్దార్లు, యంపిడిఒలు పాల్గొన్నారు. సెట్‌ వెల్‌ సిఇఒ శ్రీ మెహర్రాజు, డియస్‌డిఒ శ్రీ బెన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి