6, డిసెంబర్ 2010, సోమవారం
వంతెనను ఢీకొని దగ్ధమైన బస్సు: ఒకరి మృతి
మహబూబ్‌నగర్: పెద్దమందడి మండలం వెల్‌టూర్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రాయదుర్గం నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు వంతెనను ఢీకొనడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సులో ప్రయాణీస్తున్న 34మందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి