7, డిసెంబర్ 2010, మంగళవారం
వర్షం, చలిగాలులకు 10 మంది మృతి
విశాలవిశాఖ: భారీ వర్షాలు, చలి గాలులకు మంగళవారం రాష్టవ్య్రాప్తంగా 10 మంది మృతి చెందారు. వీరిలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా నలుగురు మరణించారు. జిల్లాలోని చీరాల మండలం వాడరేవుకు చెందిన సరోజనమ్మ (55), ఒంగోలు మండలం చింతాయగారిపాలేనికి చెందిన శింగోతు లలితాంబ(75), పొదిలి మండలానికి చెందిన రవ్వా చెంచయ్య(70), పొన్నలూరు మండలానికి చెందిన పారేటి కొండమ్మ(60)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. చలికి తట్టుకోలేకగుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాలవాసి షేక్ ఇమాంబీ (65), పెదకూరపాడు లగడపాడు గ్రామంలో వి.వరలక్ష్మి (80) చనిపోగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నం అర్బన్ మండల పరిధిలోని వాడపాలెంలో సాక్షి వైదేహమ్మ(69), బంటుమిల్లి మండలం అర్తమూరుకు చెందిన కాగిత వెంకటేశ్వర్లు (70), చాట్రాయి మండలం కోటపాడుకు చెందిన షేక్ ఉద్దండు సాహెబ్ (55) కన్నుమూశారు. పశ్చిమ గోదావరిలో గోడ కూలి దెందులూరు మండలం సీతంపేటలో గుజ్జుల రమణ (42) మృతి చెందారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి