చోడవరం(విశాల విశాఖ): కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీని విమర్శించే స్థాయి జగన్‌వర్గం నాయకుడు అంబటి రాంబాబుకు లేదని మంత్రి బాలరాజు అన్నారు. విజయరామరాజుపేటలోఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాపై అంబటి చేసిన వాఖ్యల పట్ల మండిపడ్డారు. ఆమెపై చేసిన వాఖ్యల్ని ఉపసంహరించుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసం పదవుల్ని సైతం త్యజించిన సోనియాపై విమర్శలు చెయ్యడం అంబటి లాంటి వ్యక్తులకు తగదని పేర్కొన్నారు. తన స్థాయిని పెంచుకోవడానికి, ప్రచారం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ నాయకులు కలిస్తే మంచి పరిణామమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి