పీసీసీ అధ్యక్షుడు డీఎస్
హైదరాబాద్-న్యూస్‌టు: అవిశ్వాస తీర్మానాన్ని ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. ''ఆ తీర్మానం అనుమతి పొందుతుందా? నిబంధనల ప్రకారం కనీసం 30 మంది సభ్యులు ఉండాలి. తెరాసకు 11 మందే ఉన్నారు. ఒకవేళ భాజపాను కలుపుకొన్నా మొత్తమ్మీద 13 మందే అవుతారు. కేసీఆర్ తీర్మానం పెట్టమనండి మేమైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తెదేపాతో తాముకుమ్మక్యయ్యామనడాన్ని సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఖండించారు. సహాయ నిరాకరణపై ఆయన స్పందిస్తూ.. ప్రజలకు మేలు జరక్కపోయినా.. వారికి ఇబ్బంది మాత్రం కలుగకూడదన్నారు. సహాయ నిరాకరణ వల్ల.. రోజుకూలీతో బతుకుతున్న కూలీల పరిస్థితేంటన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున ఈ కార్యక్రమంపై పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నచ్చజెబుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి కొండా సురేఖపై అధిష్ఠానం సమీక్షిస్తోందని సరైన సందర్భంలో నిర్ణయం తీసుకుంటారని డీఎస్ తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి