ఢిల్లీ బయలుదేరే ముందు అన్నయ్య చిరంజీవితో తమ్ముడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన తర్వాత చిరంజీవి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఏం జాగ్రత్తలు చెప్పారనేది ఆసక్తిగా మారింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కాబోతోందని, వివరాలు అన్నయ్యనే వెల్లడిస్తారని పవన్ కళ్యాణ్ చిరంజీవితో భేటీకి ముందు చెప్పారు. దీన్ని బట్టి కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావడమనేది లాంఛనమేనని తెలుస్తోంది.కాంగ్రెసు నాయకత్వంతో, సోనియాతో వ్యవహరించాల్సిన తీరుపై పవన్ చిరంజీవితో మాట్లాడినట్లు తెలుస్తోంది. సమైక్యావదంపై, తెలంగాణ అంశంపై పవన్ అన్నయ్యతో మాట్లాడినట్లు చెబుతున్నారు. చిరంజీవిని ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. కాంగ్రెసుతో దోస్తీ అందుకు అనుగుణంగానే ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెసు కూడా చిరంజీవితో దోస్తీపై పవన్ కళ్యాణ్, ఇతర సినీ స్టార్ల మద్దతును కూడా దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి