హైదరాబాద్: దేశంలో మొదటిసారిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోని ప్రత్యేక దళాలతోపాటు సాయుధ బలగాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సమాయత్తం అవుతోంది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన సూచనలను అనుసరించి ఎస్‌ఎస్‌సీ దేశవ్యాప్తంగా సాయుధబలగాల్లో 53వేల ఖాళీలను భర్తీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ కార్యాలయాల్లోని గ్రూప్ బి స్థాయి ఖాళీలను భర్తీ చేసే ఎస్‌ఎస్‌సీ తాజాగా సాయుధ బలగాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తుండటం ఇదే ప్రథమం. దీనికోసం కమిషన్ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ బలగాలతోపాటు ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్‌లో భర్తీచేసే కొత్త ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు శారీరక దృఢత్వంకలిగినవారు అర్హులని, సాయుధబలగాల్లోని ఖాళీలను ఆరునెలల్లో భర్తీ చేస్తామని ఎస్‌ఎస్‌సీ ఛైర్మన్ రఘుపతి తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి