హైదరాబాద్ : దేశ రక్షణ మంత్రి ఏకే ఆంటోనిని చిరంజీవి ఇంటికి రాయబారానికి పంపి 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని, హైకమాండ్ తీరుపై తనకు ఎంతో బాధ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. అంత తొందరేమొచ్చిందని చిరంజీవితో పొత్తుకు వెంపర్లాడుతున్నారని కాకా ప్రశ్నించారు. ఆంటోని సోనియా దూతంగా కేవలం చిరంజీవని కలవడానికే రావడం తనకు అవమానంగా ఉందని, చిరంజీవిని ఢిల్లీకి పిలిపిస్తే వెళ్లకపోదునా? అని ఆయన అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని విమర్శించిన చిరంజీవితో పొత్తును భరించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి రావడాన్ని ఇవాళ ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నారు. వారు తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారని కాకా అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి