7, డిసెంబర్ 2010, మంగళవారం
మల్లెడవాగులో గల్లంతైన 11మంది మృతదేహాలు లభ్యం
గుంటూరు: జిల్లాలోని వినుకొండ మండలం మల్లెడవాగులో మంగళవారం రాత్రి వాహనంలో గల్లంతైన 13మందిలో 11 మంది మృతదేహాలు ఈ ఉదయం లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన 16 మంది పుట్టెంట్రుకలు తీయించేందుకు గుంటూరు జిల్లా కారంపూడికి మంగళవారం ఉదయం సుమోలో బయల్దేరి వెళ్లారు. కారంపూడిలో కార్యక్రమం అంతా పూర్తయ్యాక తిరిగి బయల్దేరారు. రాత్రి 7 గంటల సమయానికి పిట్టబండ గ్రామాన్ని దాటారు. ఉమ్మడివరం చేరేందుకు మధ్యలో ఉన్న మల్లెడవాగు ప్రవాహం తక్కువగా ఉంటుందనుకొని డ్రైవరు సుమోను నడిపినట్లు భావిస్తున్నారు. ప్రవాహ వేగం ఎక్కువవడంతో వాహనం కొట్టుకుపోయింది. సుమోలో 16 మంది ఉన్నారు. వారిలో ముగ్గురిని స్థానికులు రక్షించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి