పాడేరు(విశాల విశాఖ): ప్రతిష్టమైన చర్యల ద్వారా విశాఖ ఏజెన్సీలో ప్రజా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ తహసీల్దార్లకు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిజన శంకర్ ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పంపిణీ,6వ విడత భూ పంపిణీకి అవసరమయ్యే భూ సేకరణపై ఏజెన్సీలోని తహసీల్దార్‌లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.జిల్లాలో అతి పేదలైన వారికి పంపిణీకి ఏడువేల అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు అందించేందుకు నిర్ణయించామన్నారు. అందులో 5వేల 500 ఎ.ఎ.వై. కార్డులు ఏజన్సీకి ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ కార్డులపై 35 కేజీలు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ప్రాధాన్యతను బట్టి ఆదిమ జాతుల తెల్లరేషన్ కార్డులను ఎ.ఎ.వై. కార్డులుగా మార్చి డిశంబర్ నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 6వేల టన్నుల సామర్ధ్యం గల పాడేరు జి.సి.సి. గోడౌన్‌లో పూర్తి స్థాయి నిల్వలు ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.బియ్యం, గోదుమ, కిరోసిన్ పంపిణీలో తూనికలు సరిగా ఉండేటట్లు చూడాలన్నారు. రాబోయే కాలంలో నియోజక వర్గ మండలాల్లో 5వేల దీపం కనెక్షన్లకు నమోదులు స్వీకరించాలన్నారు. 6వ విడత అటవీ భూముల పంపిణీకి అన్ని మండలాల్లో సర్వేలు పూర్తి చేయాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ భూ సేకరణ యొక్క రికార్డుల పని సంపూర్ణంగా ఉండాలన్నారు. భూ సేకరణ మెదర్‌మెట్స్, మెన్యూవల్స్ తయారీలను ముందు చేయాలన్నారు. తరువాత సిఎడి, సిఎఎం.పద్ధతిలో కంప్యూటర్‌లో పొందు పర్చాలన్నారు. ఏజెన్సీలోని అన్ని తాలుక కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. మండలాల వారిగా సమీక్ష చేస్తూ సిబ్బంది కొరత ఉన్న, మావోయిస్టుల సమస్య ఉన్న అంకితభావంతో విధి నిర్వహణ చేస్తున్నామన్నారు. అడంగల్, బేెసిక్ ప్రాతిపధికన భూ సేకరణకు వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆరువేల రేషన్ కార్డులు ఉన్న చోట ఒక డిఆర్‌డిపో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సర్వే సహాయ సంచాలకులు, 11 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి