న్యూఢిల్లీ: ఇరవై రెండేళ్ల న్యాయశాఖ విద్యార్థి ఒకరు అన్నా హజారేకి 'దేశప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని' లీగల్ నోటీసు ఇచ్చాడు. అన్నా బృందం అవినీతి మీద పోరాటాన్ని ఒక్క పార్టీకి వ్యతిరేకంగా మళ్లించి భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని విభోర్ ఆనంద్ అనే యువకుడు ఆ నోటీసులో పేర్కొన్నాడు. అన్నా బృందంలోని సభ్యులందరికీ కూడా ఈ నోటీసులను ఇచ్చారు. పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అన్నా ఉద్యమించినందుకు దేశంలో లక్షలాది ప్రజలు స్ఫూర్తి పొందారని, అలాంటిది ఇప్పుడు అన్నా బృందం తమ పంథా మార్చుకుని ఒక్క కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకుందని ఈ నోటీసులో పేర్కొన్నారు. లోక్‌పాల్ బిల్లు కోసం శీతాకాల సమావేశాలవరకూ కూడా ఆగకుండా అన్నాబృందం ప్రతినిధులు వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రచారం గురించి కూడా ప్రకటనలు చేశారని, హిసార్ ఉప ఎన్నికకీ అదే ధోరణిలో ప్రచారం ప్రారంభించారని నోటీసులో పేర్కొన్నారు. ఈ చర్యలు అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నీరుకారుస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి