న్యూఢిల్లీ: విజయవాడలో ఎంబీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని తరగతి గదిలోనే దారుణంగా నరికిచంపిన మనోహర్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అతనికి స్థానిక సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించగా హైకోర్టు దాన్ని జీవితఖైదుగా మార్చింది. అతనికి ఉరిశిక్ష విధించాలంటూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుచేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ప్రభుత్వ పిటీషన్‌ను తోసిపుచ్చింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి