హైదరాబాద్: శామీర్‌పేట వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కారు, బైక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రశాంత్, సురేష్‌గా పోలీసులు గుర్తించారు. తూముకుంట వద్ద ఓ రూములో ప్రశాంత్, సురేష్ అద్దెకు ఉండి ఇక్కడి అమీనా కళాశాలలో ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు. ఎప్పటిలాగే ఉదయం కాలేజికి వెళ్లి మధ్యాహ్నం పరీక్ష ఉందని రూముకు బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఈ సమయంలోనే ప్రమాదం జరిగింది. ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సురేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రశాంత్‌ది మేడ్చెల్ మండలం అంగడిపేట కాగా, సురేష్‌ది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. పోలీసులు కేసు నమోదు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి