హైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. బందర్‌రోడ్డులోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్ రోడ్డులో మాజీ ఎంపీ దివంగత నేత పి ఉపేంద్ర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.అనంతరం సింగ్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నాం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కాంగ్రెస్ 125వ వార్షిక ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సాయంత్రం అయిదు గంటలకు సీఎం తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి