15, నవంబర్ 2010, సోమవారం
ఎట్టకేలకు చిక్కిన మొసలి
హైదరాబాద్: నానాక్‌రాంగూడ సెల్లార్ గుంతలో కొద్దిరోజుల క్రితం కనిపించిన మొసలిని పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గుంతలో నీరు తగ్గిపోవడంతో ఈ ఉదయం 3 గంటల సమయంలో మొసలి తప్పించుకొని బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి అధికారులకు సమాచారమిచ్చాడు. మరో 4 గంటలు శ్రమించి అటవీశాఖ సిబ్బంది సమీపంలోని పొదల్లో మొసలిని పట్టుకున్నారు. మొసలిని జూ పార్కుకు తరలించి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. సెల్లార్ గుంతలో కొద్దిరోజుల క్రితం మొసలి కనిపించడంతో అధికారులు 9 మోటార్లతో నీటిని తోడివేయించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి