14, నవంబర్ 2010, ఆదివారం
ఉభయసభలు 12 గంటలకు వాయిదా
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ అంశం మరోమారు పార్లమెంటును కుదిపేసింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకే రాజీనామా చేశానంటూ మాజీ మంత్రి రాజా ప్రకటించినప్పటికీ ఈ అంశం ఉభయసభల్లో గందరగోళం సృష్టించింది. మూడు రోజుల విరామం అనంతరం ఉభయసభలు సోమవారం సమావేశమయ్యాయి. సమావేశమైన కొద్దిసేపటికే విపక్షాలు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీతో విచారణ జరిపించాలని పట్టుబట్టాయి. సభ సజావుగా సాగకపోవడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను 12గంటలకు వాయిదా వేశారు. కొద్దిసేపటికే లోక్‌సభను 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ మీరాకుమార్ నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి